Tuesday, November 29, 2011

రాజరాజేశ్వరి మంత్రమాతృకాస్తవః

               కళ్యాణాయుతపూర్ణచంద్రవదనాం ప్రాణేశ్వరానందినీమ్ 
               పూర్ణాo పూర్ణతరాం పరేశమహిషీం పూర్ణామృతాస్వాదినీమ్
               సంపూర్ణాం పరమోత్తమామృతకలాం విధ్యావతీం భారతీమ్
               శ్రీచక్రప్రియబిన్దుతర్పణపరాం శ్రీరాజరాజేశ్వరీమ్             II 

               ఎకారాదిసమస్తవర్ణ  వివిధాకారైకచిద్రూపిణీమ్
               చైతన్యాత్మకచక్రరాజనిలయాం చంద్రాన్తసంచారిణీమ్      
               భావాభావవిభావనీం భవపరామ్ సద్భక్తిచిన్తామణీమ్    
               శ్రీచక్రప్రియబిన్దుతర్పణపరాం శ్రీరాజరాజేశ్వరీమ్             II 

               ఈశాధిక్పరయోగివృందవిదితామ్ స్వానన్దభూతాంపరామ్
               పశ్యన్తీo తనుమధ్యమాం విలసినీం శ్రీవైఖరీరూపిణీమ్
               ఆత్మానాత్మవిచారిణీం వివరగాం విధ్యాం త్రిబీజాత్మికామ్
               శ్రీచక్రప్రియబిన్దుతర్పణపరాం శ్రీరాజరాజేశ్వరీమ్             II 


               లక్ష్యాలక్ష్యనిరీక్షణాం నిరుపమాం రుద్రాక్షమాలాధరామ్  
               త్ర్యక్షాధ్రాకృతిదక్షవంశకలికాం దీర్ఘాక్షదీర్ఘస్వరామ్ 
               భద్రాం భద్రవరప్రదాం భగవతీం భద్రేశ్వరీం ముద్రిణీమ్
               శ్రీచక్రప్రియబిన్దుతర్పణపరాం శ్రీరాజరాజేశ్వరీమ్             II 


               హ్రీంబీజాగతనాదబిన్దుభరితామోంకారనాదాత్మికామ్ 
               బ్రహ్మానందఘనోదరీం గుణవతీం జ్ఞానేశ్వరీం జ్ఞానదామ్
               ఇచ్చాజ్ఞానకృతినీం మహీం గతవతీం గంధర్వసంసేవితాం
               శ్రీచక్రప్రియబిన్దుతర్పణపరాం శ్రీరాజరాజేశ్వరీమ్             II 


              హర్షోన్మత్తసువర్ణపాత్రభరితాం పీన్నోన్నతాఘూర్నితామ్    
              హూంకారప్రియశబ్దజాలనిరతాం సారస్వతోల్లసినీమ్ 
              సారసారవిచారచారుచతురాం వర్ణాశ్రమాకారిణీమ్
              శ్రీచక్రప్రియబిన్దుతర్పణపరాం శ్రీరాజరాజేశ్వరీమ్             II 


              సర్వేశాంగవిహారిణీం సకరుణాo సన్నాదినీం నాదినీం 
              సంయోగాప్రియరూపిణీం ప్రియవతీం ప్రీతాం ప్రతాపోన్నతామ్
              సర్వాన్తర్గతశాలినీం శివతనుసందీపినీం దీపినీం 
              శ్రీచక్రప్రియబిన్దుతర్పణపరాం శ్రీరాజరాజేశ్వరీమ్             II 


              కర్మాకర్మవివర్జితాం కులవతీం కర్మప్రదాం కౌలినీమ్ 
              కారుణ్యాంబుధిసర్వకామనిరతాం సిన్దుప్రియోల్లాసినీమ్
              పంచబ్రహ్మసనాతనాసనగతాం గేయాం సుయోగాన్వితామ్
              శ్రీచక్రప్రియబిన్దుతర్పణపరాం శ్రీరాజరాజేశ్వరీమ్             II 


              హస్త్యుత్కుమ్భనిభస్తనద్వితయతః పీన్నోన్నతాదానతామ్
              హారాధ్యాభరణాం సురేన్ద్రవినుతాం శృంగారపీఠాలయామ్
              యోన్యాకారకయోనిముద్రితకరాం నిత్యాం నవార్ణాత్మికామ్
              శ్రీచక్రప్రియబిన్దుతర్పణపరాం శ్రీరాజరాజేశ్వరీమ్             II 


              లక్ష్మీలక్షణపూర్ణభక్తవరదాం లీలావినోదస్థితాం
              లక్షారంజితపాదపద్మయుగలాం బ్రహ్మేంద్రసంసేవితామ్
              లోకాలోకితలోకకామజననీం లోకాశ్రయాన్కస్థితామ్
              శ్రీచక్రప్రియబిన్దుతర్పణపరాం శ్రీరాజరాజేశ్వరీమ్             II 


              హ్రీంకారాశ్రితశంకరప్రియతనుం శ్రీయోగపీఠీశ్వరీం
              మాంగల్యాయుతపంకజాభనయనాం మాంగల్యసిద్ధిప్రదామ్     
              తారుణ్యేన విశేషితాంగసుమహలావణ్యసంశేభితామ్ 
              శ్రీచక్రప్రియబిన్దుతర్పణపరాం శ్రీరాజరాజేశ్వరీమ్             II 


              సర్వజ్ఞానకలావతీం సకరుణాం సర్వేశ్వరీం సర్వగామ్
              సత్యాం సర్వమయీం సహస్త్రదలగాం సత్వార్ణవోపస్థితామ్
              సంగాసంగవివర్జితాం సుఖకరీం బాలార్కకోటిప్రభాం 
              శ్రీచక్రప్రియబిన్దుతర్పణపరాం శ్రీరాజరాజేశ్వరీమ్             II 


              కాదీక్షాన్తసువర్ణబిన్దుసుతనుం సర్వాంగసంశేభితామ్
              నానావర్ణవిచిత్రచిత్రచరితాం చాతుర్యచిన్తామణీమ్
              చిన్తానందవిధాయినీం సుచపలాం కూటత్రయాకారిణీమ్
              శ్రీచక్రప్రియబిన్దుతర్పణపరాం శ్రీరాజరాజేశ్వరీమ్             II 

              లక్ష్మీజ్ఞానవిధీంద్రచంద్రమకుటాఘష్టాంగపీఠాశ్రితామ్ 
              సూర్యేన్ద్రగ్నిమయౌకపీఠనిలయాం త్రిస్థాం త్రికోణేశ్వరీమ్
              గోప్త్రీం గర్వనిగర్వితాం గగనగాం గంగాగణేశప్రియామ్
              శ్రీచక్రప్రియబిన్దుతర్పణపరాం శ్రీరాజరాజేశ్వరీమ్             II 


              హ్రీంకూటత్రయరూపిణీం సమయినీం సంసారిణీo హంసినీమ్
              వామారాధ్యపదాంబుజాo సుకులజాం బీజావతీం ముద్రిణీమ్
              వామాక్షీం కరుణాద్రచిత్తసహితాం శ్రీం శ్రీత్రిమూర్త్యంబికామ్ 
              శ్రీచక్రప్రియబిన్దుతర్పణపరాం శ్రీరాజరాజేశ్వరీమ్             II 


              యా విధ్యా శివకేశవాదిజననీ యా వై జగన్మోహినీ
              యా బ్రహ్మాదిపిపీలికాన్తజగదానందైకసందాయినీమ్
              యా పంచప్రణవాద్విరేఫనలినీ యా చిత్కలామాలినీ
              సా పాయాత్పరదేవత భగవతీ శ్రీరాజరాజేశ్వరి              II 


               అనేనా శ్రీ రాజరాజేశ్వరిమాతృకామంత్రస్తవ శ్లోక పఠన 
            పారాయణేస్త భగవతీ సర్వాత్మికా రాజరాజేశ్వరీ 
            పాదారవిందార్పణమస్తు     II 


                                      ఓం శాన్తి శాన్తి శ్శాన్తి: 
  

Friday, November 11, 2011

వినాయక దండకం

 శ్రీ పార్వతీపుత్ర, లోకత్రయీస్తోత్ర, సత్పుణ్యచారిత్ర, భద్రేభవక్త్రా మహాకయా, కాత్యాయనీనాథసంజాతస్వామీ,శివాసిద్ధి విఘ్నేశ, నీపాదపద్మంబులన్ నీదుకంఠంబు నీబోజ్జ నీమోము నీమౌళిబాలేందు ఖండంబు నీనాల్గు హస్తంబులన్ నీకరాళంబు నీపెద్ద వక్త్రంబు దంతబు నీ పాదహస్తంబు, లంబోదరంబున్ సదామూషకాశ్వంబు నీ మందహాసంబు నీచిన్న తొండంబు నీగుజ్జరూపంబు నీశూర్పకర్ణంబు నీ నాగయజ్ఞోపవీతంబు నీభవ్యరూపంబు దర్శించి హర్షించి సంప్రీతి మ్రొక్కంగ శ్రీగంధమున్ గుంకుమబ్వక్షతల్ జాజులన్ చపకంబుల్ తగన్ మల్లెలున్ మోల్లలున్ మంచి చేమంతులన్ దెల్లగన్నేరులన్ మంకెనల్ పొన్నలున్ పువ్వులన్ మంచి దూర్వంబున్ దెచ్చి శాస్త్రోక్తరీతిన్ సమర్పించి పూజించి సాష్టాంగముంజేసి విఘ్నేశ్వరా! నీకు టెంకాయిపోన్నంటి పండ్లున్ మఱిన్ మంచివౌ నిక్షుఖండంబులన్ రేగు బండ్లప్పడల్ వడల్ నేయిబూరెల్ మరిన్ గోధుమప్పంబులన్ వడల్ పునుగులన్ బూరెలున్ గారెలున్ చొక్కమౌచల్మిడిన్ బెల్లమున్ దేనెయుంజున్న బాలాజ్యమున్ నానుబియ్యం బునామ్రంబు బిల్వంబు మేల్ బంగరున్ బళ్ళేమందుంచి నైవేద్యముంబంచి నీరాజనంబున్ నమస్కారముల్ చేసి విఘ్నేశ్వరా! నిన్ను బూజింపకే యన్యదైవంబులం బ్రార్ధనల్ సేయుటల్ కాంచనం బోల్లకే యిన్ము దాగోరు చందంబుగాదే మహాదేవ! యోభక్తమందార!యోసుందరాకర! యోభాగ్య గంభీర! యోదేవ చూడామణీ! లోక రక్షామణీ! బంధు చింతామణీ!స్వామీ! నిన్నెంచ, నేనంత నీ దాసదాసాది దాసుండ శ్రీదొంతరాజాన్వ వాయుండ రామాభిధానుండ నన్నిప్డు చేపట్టి సుశ్రేయునింజేసి శ్రీమంతుగన్ జూచి హృత్పద్మ సింహాసనారూఢతన్ నిల్పి కాపడుటేకాదు నిన్గోల్చి ప్రార్ధించు భక్తాళికిన్ గొంగు బంగారమై కంటికిన్ రెప్పవై బుద్ధియున్ విద్యయున్ పాడియున్ బుత్రపౌత్రాభివృద్దిన్ దగన్ కల్గగాజేసి పోషించు మంటిన్ గృపన్ గావుమంటిన్ మహాత్మా! యివే వందనంబుల్ శ్రీగణేశా!                         
                                        నమస్తే నమస్తే నమస్తే నమః II