1) శ్లోకం: ఓం నమః ప్రణవార్ధాయ శుద్ధజ్ఞానైక మూర్తయే
నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః
ప్రతిపదార్ధం: ఓం = ఓంకారము, ప్రణవార్ధాయ = ప్రణవ(అనగా ఓంకారము శబ్ధమునకు) అర్ధమైనట్టియు,
శుద్ధ = తెల్లనిది(దోషము లేనిది), జ్ఞానైక మూర్తయే = జ్ఞాన స్వరూప మూర్తియైనట్టియు,
నిర్మలాయ = స్వచ్ఛమైనట్టియు (మలినంలేనట్టియు), ప్రశాంతాయ = శాంత స్వరూపుడగు,
దక్షిణామూర్తయే = దక్షిణామూర్తి కొరకు, నమః = నమస్కారము.
తాత్పర్యం: ప్రణవనాదమగు ఓంకారానికి అర్ధంగా, జ్ఞాన స్వరూపమైన, శుద్ధమైన,
స్వచ్ఛమైన ప్రసన్నమూర్తికి నమస్కారములు......
2) శ్లోకం: గురవే సర్వలోకానాం భిషజే భవ రోగిణాం
నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః
ప్రతిపదార్ధం: గురవే = గురువగు, సర్వలోకానాం = సమస్త లోకములకు,
భిషజే = మందు అగునట్టియు (వైద్యుడు), భవ రోగిణాం = సంసార రోగగ్రస్తులకు(వ్యాధి ),
నిధయే = నిధయగునట్టియు , సర్వవిద్యానాం = విద్యలన్నిటికి,
దక్షిణామూర్తయే = దక్షిణామూర్తి కొరకు, నమః = నమస్కారము.
తాత్పర్యం: సమస్త లోకములకు గురువై, సంసార మనేడి బంధమునకు, రోగ బాధితులకు వైద్యుడై,
సకల విద్యలకును నిధియగు అట్టి దక్షిణామూర్తికి నమస్కారములు .....
వ్యోమ వద్ వ్యాప్త రూపాయ దక్షిణామూర్తయే నమః
తాత్పర్యం: పరబ్రహ్మ నిర్గుణుడు , అవ్యక్తుడు అటువంటి వాని వ్యక్త రూపమే సగుణ బ్రహ్మ.
ఆ సగుణ బ్రహ్మమే గురువు.
ఆకశాతత్త్వం వలె సర్వత్ర వ్యాపించి ఉండే పరబ్రహ్మ స్వరూపమైన
శ్రీ దక్షిణామూర్తికి నా నమస్కారములు.
శ్రీ దక్షిణామూర్తికి నా నమస్కారములు.
4) శ్లోకం: చిత్రం వట తరోర్మూలే వృద్ధాః శిష్యా గురుర్ యువా
గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్న సంశయాః
ప్రతిపదార్ధం: చిత్రం = ఆశ్చర్యం!, వటతరో: = మర్రి చెట్టు యొక్క, మూలే = మూలమున,
వృద్ధాః = ముసలి వారు, శిష్యా = శిష్యులు, గురు: = గురువు, యువా = యువకుడు,
వృద్ధాః = ముసలి వారు, శిష్యా = శిష్యులు, గురు: = గురువు, యువా = యువకుడు,
గురు: = గురువు, అస్తు = వర్తించు, మౌనం = మౌనమే,
వ్యాఖ్యానం = వ్యాఖ్యానము, శిష్యాః = శిష్యులు, ఛిన్న= నశించు,
సంశయాః = సందేహములు.
వ్యాఖ్యానం = వ్యాఖ్యానము, శిష్యాః = శిష్యులు, ఛిన్న= నశించు,
సంశయాః = సందేహములు.
తాత్పర్యం: ఎంత ఆశర్యం! మర్రిచెట్టు మూలభాగమున యువకుడైన గురువు చుట్టూ వృద్ధులైన శిష్యులున్నారు, గురవు యొక్క మౌనము చేతనే శిష్యుల యొక్క సందేహములు నశింపుచున్నవి.
No comments:
Post a Comment